వరుసల గొలుసులు సొగసుల పూలు
‘బంగారం! ఒకటి చెప్పనా’.. అంటూ ఎన్ని విషయాలు ముచ్చటించినా ఇష్టంగా వింటారు ఆడపిల్లలు. ఎందుకంటే, ఇక్కడ ‘బంగారం’ అన్న పదం ఉంది కనుక. బంగారం ఎంత పిరమైనా సరే, దాన్ని ప్రియమైనదిగానే భావిస్తారు. మెరుగు పెట్టినా, పెట్టకపోయినా ఆ పచ్చని లోహాన్ని చూడగానే అతివల కళ్లలో మెరుపు మాత్రం తప్పక కనిపిస్తుంది.
- బంగారం సింగారించుకోవడం అంటే అతివలకు అమితమైన అపేక్ష. ఎక్కడా రాజీపడరు. కాంటెంపరరీగా కనిపించాలి, డ్రెస్‌కు నప్పేలా ఉండాలి, డిజైన్ విషయంలో తగ్గేదే లే అంటారు. ప్రస్తుతం, అతివ మనసుకు అద్దం పట్టేలా.. లేయర్డ్ గొలుసులు, ఫ్లవర్ మోటిఫ్స్ నగలు ట్రెండింగ్‌లో ఉన్నాయంటున్నారు డిజైనర్లు
‘బంగారం! ఒకటి చెప్పనా’.. అంటూ ఎన్ని విషయాలు ముచ్చటించినా ఇష్టంగా వింటారు ఆడపిల్లలు. ఎందుకంటే, ఇక్కడ ‘బంగారం’ అన్న పదం ఉంది కనుక. బంగారం ఎంత పిరమైనా సరే, దాన్ని ప్రియమైనదిగానే భావిస్తారు. మెరుగు పెట్టినా, పెట్టకపోయినా ఆ పచ్చని లోహాన్ని చూడగానే అతివల కళ్లలో మెరుపు మాత్రం తప్పక కనిపిస్తుంది. ఇక కొత్త ట్రెండ్‌ను ఇష్టపడేవారైతే.. కడగంటి చూపుతోనే జువెలరీ షోరూమ్ అద్దాల అరలను స్కాన్ చేస్తారు. ఆ క్షణంలో మగువ మెదడు
లక్ష కంప్యూటర్లకు సరిసమానంగా పనిచేస్తుంది. చాట్ జీపీటీకి దీటైన సమాచారం మనోవేగంతో ప్రాసెస్ అవుతుంది. చివరికి ఆమె మనసు వరు సల గొలుసులు, పువ్వుల డిజైన్ల వైపు మళ్లుతుంది.
నచ్చేస్తున్నాయి
ఒక గొలుసు వేసుకుంటే.. ఎన్నో నగలు పెట్టుకున్నట్టుగా కనిపించే లేయర్డ్ ఆభరణాలు ఆడపిల్లలను అయస్కాంతంలా ఆకట్టుకుంటున్నాయి. ఒకే నగలో రెండు మూడు వరుసల చెయిన్లు రావడం వీటి ప్రత్యేకత. గుండ్లు, చిన్న పువ్వులు, సన్నని గొలుసులు.. ఇలా వివిధ రకాలను లేయర్లుగా చేసి వీటిని రూపొందిస్తారు. నగల వరుసలకు లేదా పక్కలకు లాకెట్లను జోడిస్తారు. ఇక, ఈ ఏడాది ట్రెండ్స్‌లో పువ్వుల డిజైన్లు ముందు వరుసలో ఉన్నాయి. చూడచక్కని ఆకృతుల్లో, ముచ్చట గొలిపే డిజైన్లతో.. రాళ్లు, కుందన్లు పొదిగిన ఫ్లవర్ మోటిఫ్ నగల వగలు వయ్యారులను వశపరచుకుంటున్నాయి. ఈ తరహాలో నెక్లెస్‌లు, చెవిపోగులు, బ్రేస్లెట్ల లాంటివెన్నో ముస్తాబవుతున్నాయి. ఇంకేముంది, ఏ వేడుకలో అయినా ఆకర్షణ ఆమెదే.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- 24 carat gold
- gold
- jewelery
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

