నేనున్నానని..
భార్యాభర్తలంటేనే ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారని అర్థం. ఆర్థికంగానూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఇల్లాలి వంతు ఇంటిని చక్కదిద్దడం మాత్రమే కాదు.. ఆర్థికంగా కుటుంబానికి భరోసా ఇవ్వడం కూడా అని అంటున్నారు నేటి మహిళలు. చాలామంది ఉద్యోగాలు చేస్తూ.. బాధ్యతలు పంచుకుంటున్నారు.
భార్యాభర్తలంటేనే ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారని అర్థం. ఆర్థికంగానూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఇల్లాలి వంతు ఇంటిని చక్కదిద్దడం మాత్రమే కాదు.. ఆర్థికంగా కుటుంబానికి భరోసా ఇవ్వడం కూడా అని అంటున్నారు నేటి మహిళలు. చాలామంది ఉద్యోగాలు చేస్తూ.. బాధ్యతలు పంచుకుంటున్నారు. ఈ ఇల్లాలు కూడా అలాగే భర్త బాధ్యతలు పంచుకుంది. గరిటె తిప్పిన చేతితోనే వెల్డింగ్ రాడ్‌ను చేతబట్టింది. కుటుంబ షోషణ కోసం తన భర్త ప్రభుదాస్‌కు తోడుగా నిలిచిన విజయలక్ష్మి ఒక చేత్తో ఇంటి పని చక్కదిద్దుతూనే.. మరో చేత్తో వెల్డింగ్ పనులు చేస్తున్నది.
‘మాకు పళ్లై ఇరవైఏైండ్లెంది. ఇద్దరు పిల్లలు. పదేళ్ల క్రితం బతుకు దెరువుకోసం స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చాం. నా భర్త వెల్డింగ్ పని చేస్తుంటాడు. పొద్దున ఎనిమిది గంటలకు పోయి రాత్రి ఏడింటికి ఇంటికొస్తాడు. ఎందుకింత ఆలస్యమవుతుందని అడిగితే ‘మనలాగా మన పిల్లలు బతుకొద్దని వారిని గొప్ప చదువులు చదివించాలన్నా. మన బంధువుల్లో మనం గొప్పగా జీవించాలన్నా డబ్బు అవసరం’ అని సమాధానం చెప్పాడు. ఆయన మాటలు సబబే అనిపించాయి. ఇంటిపట్టున ఉండే నేను ఆయనకు తోడుగా నిలువాలనుకన్నా. నాకు కూడా వెల్డింగ్ పని నేర్పించమని అడిగాను. మొదట్లో ఆడవాళ్లు చేసే పనికాదని, నీకెందుకు ఈ ఇబ్బందులన్నాడు.
నేను పట్టు వీడకపోవడంతో పని నేర్పాడు. ఇప్పుడు ఆయనతో సమానంగా పని చేస్తున్నాను. మొదట్లో చిన్న చిన్న పరికరాలను మాత్రమే వెల్డింగ్ చేసేదాన్ని. ఇప్పుడు వ్యవసాయ పరికరాలు, భారీ వాహనాలకు సైతం వెల్డింగ్ చేస్తున్నాను. డ్రిల్లింగ్ పనులు చేసేస్తాను. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఇద్దరం కలసి దుకాణానికి వెళ్తాం. సాయంత్రం ఐదు గంటల దాకా పనిచేస్తాం. ఇద్దరం కలిసి పని చేస్తూ కొంత డబ్బును భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేస్తున్నాం. చాలామంది వెల్డింగ్ చేస్తున్న నన్ను చూసి ‘ఆమెతో ఎందుకు పని చేయిస్తున్నావ’ంటూ నా భర్తను నిందించారు. కానీ నా ఇష్టంతో నేనే ఇందులోకి వచ్చానని తెలిశాక ఇద్దర్నీ మెచ్చుకున్నారు. ఈ పనిని నేను ఎన్నడూ భారంగా భావించలేదు. ఒక ఇంటికి ఇల్లాలిగా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అంతే!’ అని చెప్పుకొచ్చిన విజయలక్ష్మి జీవిత భాగస్వామికి సరైన నిర్వచనం అని అందరూ అంటున్నారు.
-చిలగాని విజయ్‌కుమార్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

