Janagama Collector | వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సత్వరమే సేవలందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Janagaon Collector | జనగాం జిల్లా బచ్చన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బచ్చన్నపేట : జనగాం జిల్లా బచ్చన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( PHC ) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, పిల్లల వార్డు, ఇన్ పెషేంట్ వార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు.
ఓపీ ద్వారా ప్రతి రోజు ఎంత మంది వైద్యం పొందుతున్నారు? ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి? అని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచాలని, అందుకు తగ్గట్లుగా వైద్యాధికారులు, ఆశాలు పని చేయాలన్నారు. ఇన్ పెషేంట్ వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి లోపల, పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించాలని, చెట్లను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
అనంతరం మండలంలోని మన్సాన్ పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటిక్యాల పల్లి గ్రామాల్లో జరుగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. మన్సాన్ పల్లి అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాతృ నాయక్, అధికారులు తదితరులున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

