ఇంట్లోనో, దుకాణాల్లోనో భగవంతుడికి పూజలు చేయడంతోపాటు, సువాసనల కోసం అగరబత్తీలను వెలిగిస్తే బాగానే ఉంటుంది. కానీ పదేపదే వాటిని కాలుస్తుంటే.. పొగబారిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సువాసన ఎక్కువగా వెదజల్లే అగరబత్తీలు చాలా మందికి పడవని, వీటివల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మరి వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.