Serial Dater: 365 మందితో డేటింగ్? 90 ఏళ్ల బామ్మను కూడా వదల్లేదు
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..ఏకంగా 365 మందితో అతడికి డేటింగ్ చేయాలని ఉందట. చేయాలని ఉండటం మాత్రమే కాదు.. ఇప్పటి వరకు 335 మందితో డేటింగ్ చేశాడు. ఇంకో 30 మందితో డేటింగ్ చేస్తే మనోడి లక్ష్యం నెరవేరుతుంది. ఇంతకీ ఇదేం లక్ష్యం.. ఎవరైనా పోలీస్ కావాలనుకుంటారు.. లైఫ్ సెటిల్ అవ్వాలనుకుంటారు.. లేదా డాక్టర్ కావాలని కలలు కంటారు.. మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. కానీ.. ఈయన ఏంది.. 365 మంది మహిళలతో డేటింగ్ అంటున్నాడు.. అని తల గోక్కుంటున్నారా? ఆయన లక్ష్యం వెనుక పెద్ద కారణం ఉంది. అదేంటో.. మనోడి 365 మందితో డేటింగ్ ఏంటో తెలుసుకుందాం పదండి.

అతడి పేరు సుందర్ రాము. సౌత్ ఇండియనే. చెన్నై. వృత్తి యాక్టర్, ఫోటోగ్రాఫర్. ఈయనకు ఒక ముద్దు పేరు ఉంది.. అదేంటో తెలుసా? సీరియల్ డేటర్. ఆయన ఫేస్బుక్ ఖాతాను ఒక్కసారి ఓపెన్ చేస్తే.. మనోడి డేటింగ్ వ్యవహారం మొత్తం తెలుస్తుంది. ఆయన ఇప్పటి వరకు ఎంత మందితో డేట్ చేశాడు. వాళ్ల వయసు ఎంత? వాళ్లది ఏ దేశం.. ఇలా అన్ని వివరాలు తన ఫేస్బుక్ ఖాతాలో పొందుపరిచాడు సుందర్ రాము.
ఇప్పటి వరకు ఆయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల ఐరిష్ సన్యాసినితో పాటు.. 90 ఏళ్ల బెంగాళీ మహిళ కూడా ఉంది. అంటే.. వయసుతో సంబంధం లేకుండా.. మహిళలతో డేటింగ్ చేయడమే మనోడి స్పెషాలిటీ.
నేనేదో ప్రేమను పొందడం కోసం మహిళలతో డేటింగ్ చేయడం లేదు. లేదా మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం కోసం డేటింగ్ చేయడం లేదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే.. భారత్‌లో మహిళల హక్కుల గురించి అవేర్నెస్ తేవడమే నా గోల్. అందుకే ఈ డేటింగ్ను ఎంచుకున్నా. నేను జనవరి 1, 2015లో 365 డేట్స్ అనే కాన్సెప్ట్‌ను స్టార్ట్ చేశా. ఈ కాన్సెప్ట్‌ను నేను స్టార్ట్ చేయడానికి కారణం.. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన. ఆ ఘటన గురించి తెలిశాక.. నేను కొన్ని నెలల పాటు నిద్రపోలేదు. నా మనసంతా ఏదో బాధేసింది. మహిళలపై అంత చిన్నచూపు ఎందుకు.. అనే ప్రశ్న నాలో వచ్చింది. అందుకే.. ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశా. నా డేట్లో భాగంగా.. మహిళలతో కలిసి లంచ్ చేస్తా. కాఫీ తాగుతా. వాళ్లతో మహిళల హక్కుల గురించి చెబుతా. వాళ్లలో అవేర్నెస్ తీసుకొస్తా. ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. మతాల ముసుగును తొలగించుకొని.. స్వచ్ఛమైన ప్రేమ ఎలా పుడుతుంది, టెక్నాలజీ వల్ల మానవాళికి ముఖ్యంగా కుటుంబ విలువలు ఎలా పతనం అవుతున్నాయి.. లాంటి టాపిక్స్ గురించి నేను మహిళలతో చర్చిస్తాను.. అని సీరియల్ డేటర్ చెప్పుకొచ్చాడు. వావ్.. మనోడి లక్ష్యం బాగుంది కదా. త్వరలోనే ఆయన 365 డేట్స్ విజయవంతంగా పూర్తి కావాలని మనసారా కోరుకుందాం.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

