శక్తిమాన్‌గా వ్యవహరించొద్దు… స్టంట్‌లో గాయపడిన వ్యక్తి వీడియోతో పోలీసుల సూచన
లక్నో: శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని పోలీసులు సూచించారు. ఒక వాహనంపై ప్రమాదకరంగా స్టంట్లు చేసి గాయపడిన యువకుడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్ పోలీస్ అధికారిణి శ్వేతా శ్రీవాస్తవ ట్విట్టర్లో ఆదివారం ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఒక యువకుడు చెత్త వాహనంపై శక్తిమాన్ తరహాలో విన్యాసాలు చేశాడు. కదులుతున్న గార్బేజ్ వాహనంపై పుష్అప్లు తీశాడు. అనంతరం దానిపై ఠీవిగా నిల్చొని బిల్డప్ ఇచ్చాడు. అయితే వాహనం మలుపు తిరుగడంతో అదుపు తప్పి దాని పైనుంచి రోడ్డుపై పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడి ఫొటోలు కూడా ఆ వీడియోలో ఉంచారు. ‘గత (శనివారం) రాత్రి లక్నోలోని గోమతి నగర్‌లోని ఒక దృశ్యం. అతడు శక్తిమాన్ కావాలనుకున్నాడు. కానీ కొద్ది రోజుల పాటు కనీసం కూర్చోలేడు. హెచ్చరిక: దయచేసి అలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయవద్దు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా ఆ యువకుడి ప్రమాదకర స్టంట్లపై మండిపడ్డారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీగా జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. మరి కొందరు మాత్రం కొన్ని నిమిషాలు శక్తిమాన్‌గా మారిన ఆ యువకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

