అర్ధరాత్రిపూట వంటగదిలో శబ్ధాలు విన్న మహిళ ఇంట్లో దొంగలు పడ్డారేమో అనుకుంది. మెళ్లగా వెళ్లి చూసింది. ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. వంటగదిలో శబ్ధం చేసినంది దొంగ కాదు.. ఓ కొండచిలువ. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్లోగల గ్లెనవ్యూలో జరిగింది. ఈ వీడియోను సన్షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. సదరు మహిళ కొండచిలువను చూసిన వెంటనే స్నేక్ క్యాచర్స్కు ఫోన్చేసింది. వాళ్లు వచ్చి దాన్ని పట్టుకున్నారు. దీన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టగా, 53వేల మంది వీక్షించారు.