బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్‌డే గిఫ్ట్ : రొనాల్డోకు కోటిన్నర విలువైన కారును బహుకరించిన జార్జియానా!
పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు బర్త్‌డే సందర్భంగా ప్రియురాలు జార్జియానా రోడ్రిగ్జ్ మరుపురాని బహుమతిని అందించింది.
న్యూఢిల్లీ : పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు బర్త్‌డే సందర్భంగా ప్రియురాలు జార్జియానా రోడ్రిగ్జ్ మరుపురాని బహుమతిని అందించింది. రొనాల్డో సోమవారం 37వ పుట్టినరోజు జరుపుకుంటుండగా అతడికి ఏకంగా రూ కోటిన్నర విలువ చేసే బ్రాండ్ న్యూ కాడిలాక్ ఎస్క్లేడ్ కారును జార్జియానా కానుకగా ఇచ్చింది. రొనాల్డో తన ఇంటి తలుపు తీసిన వెంటనే ఎదురుగా న్యూ కాడిలాక్ ఎస్క్లేడ్ కారు దర్శనమివ్వడంతో ప్రియురాలి ఆప్యాయతకు మురిసిపోయాడు.

కారులో కూర్చుని ఫీచర్లను రొనాల్డో గమనిస్తున్న వీడియోను జార్జియానా రోడ్రిగ్జ్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి 37వ బర్త్‌డే శుభాకాంక్షలు, సరైన తండ్రి, సరైన ప్రేమికుడిని ఆ దేవుడు తమకు ఇచ్చాడంటూ క్యాప్షన్‌ను జోడించింది. అంతకుముందు తన బర్త్‌డే వేడుకల నుంచి జార్జియానాతో కలిసిఉన్న అందమైన ఫోటోను రొనాల్డో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను త్వరలోనే జార్జియానా రోడ్రిగ్జ్‌తో వివాహ బంధంతో ఒక్కటవుతానని రొనాల్డో ఇటీవల వెల్లడించాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- car
- girlfriend
- Ronaldo
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

