షేవింగ్ క్రీమ్ అనుకుని హెయిర్ రిమూవల్ క్రీమ్ పట్టించాడు..

న్యూఢిల్లీ : షేవింగ్ క్రీమ్ గా పొరబడి హెయిర్ రిమూవల్ క్రీమ్ ను ముఖమంతా పూసుకున్న యువకుడు ఆపై అవాక్కయ్యాడు. గోల్డ్ కోస్ట్ కు చెందిన రొనాల్డ్ వాకర్ (22) అనే యువకుడు గడ్డం గీసుకునేందుకు షేవింగ్ క్రీమ్ అయిపోవడంతో మరో బాటిల్ లో ఉన్న హెయిర్ రిమూవల్ క్రీమ్ ను పొరపాటున ముఖానికి పూర్తిగా దట్టించాడు. షేవింగ్ క్రీమ్, హెయిర్ రిమూవల్ క్రీమ్ కు వ్యత్యాసం తనకిప్పటి వరకూ తెలియదని, ఇప్పుడు తత్వం బోధపడిందని బోసి ముఖం చూసి బావురుమన్నాడు.
హెయిర్ రిమూవల్ క్రీమ్ పూసుకున్న తర్వాత తన ముఖమంతా ఎర్రగా కందడంతో పాటు మంటగా అనిపించిందని ఫేస్ బుక్ పోస్ట్ లో రొనాల్డ్ వాపోయాడు. తాను ఎన్నడూ గడ్డం భారీగా పెంచకపోవడం కలిసివచ్చినా హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడటంతో తన కనుబొమ్మలపై వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు తల ముందుభాగంలో జుట్టు రాలిపోయిందని చెప్పుకొచ్చాడు. తాను వెంటనే పనిలోకి వెళ్లాల్సి ఉందని, అయినా తాను చెబితే తప్ప ప్రజలు తన ముఖంలో మార్పును పసిగట్టలేరని సర్ధిచెప్పుకున్నాడు. రొనాల్డ్ ఎఫ్బీ పోస్టును ఇప్పటివరకూ 5000 మంది షేర్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

