టిక్‌టాక్ వీడియోలో పేషెంట్ మృతిపై హెల్త్‌కేర్ వర్కర్ సంతాపం..నెటిజన్ల ట్రోలింగ్!
న్యూఢిల్లీ : నిత్యం జరిగే ఘటనలు ఎలాంటివైనా కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్స్, వ్యూస్ రాబడుతుంటారు. సోషల్ ఇన్ఫ్లుయన్సర్ ట్యాగ్ కోసం ఆన్లైన్ వేదికల్లో ఏం చేసేందుకైనా కొందరు వెనుకాడరు. తాజాగా ఓ హెల్త్‌కేర్ వర్కర్ పేషెంట్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది.
ఆమె లైక్స్ కోసమే ఈ పని చేసిందని సమయం, సందర్భం లేకుండా పేరు కోసం విషాద ఘటనను వాడుకున్నదని పలువురు నెటిజన్లు ట్రోల్ చేశారు. లైక్స్ కోసం సున్నితమైన విషయాన్ని టిక్‌టాక్‌కు ఎక్కించడమేమిటని వారు మండిపడుతున్నారు. తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో రోగి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ టిక్‌టాకర్, హెల్త్‌కేర్ వర్కర్ వీడియోను షేర్ చేశారు.
రోగి మరణానికి కారణం ఏంటనే వివరాలను అందులో ఆమె వెల్లడించలేదు. పేషెంట్ మరణంతో తాను అప్సెట్ అయ్యానని, ఇంకా తాను ఐదు గంటల పాటు షిఫ్ట్‌లో పనిచేయాల్సి ఉందని మాత్రమే వీడియోలో చెప్పుకొచ్చారు. టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.3 కోట్ల మంది వీక్షంచారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

