ప్రకృతి ఒడిలో ఓలలాడుతోందా..ఎంపీ సంతోష్ చెప్పిన ఈ ఊరు ఎక్కడుందంటే..

ఇచ్చోడ: మనస్సు ఉంటే మార్గముంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ నిరూపిస్తోంది. పంచాయతీ ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుండడంతో ఆ గ్రామ పంచాయతీపై ట్విట్టర్లో రోజురోజుకూ ప్రశంసలు కురుస్తునే ఉన్నాయి. తాజాగా గ్రీన్ బిల్డింగ్ అంటూ శనివారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసి, ప్రశంసలు కురిపించారు. ముక్రా (కే) గ్రామస్తులు గ్రీన్ ఇండియాను చాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తుండడాన్ని ఆయన కొనియాడారు. గ్రామంలో ఇటీవల కొత్తగా రూ. 25 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు.

జీపీ బిల్డింగ్ చుట్టూ ప్రహరీకి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలనీ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఎంపీ సంతోష్ కుమార్‌ను కోరారు. వారి అభ్యర్థన మేరకు రూ.5 లక్షల నిధులను విడుదల చేశారు. జీపీ చుట్టూ ప్రహరీ, ఆవరణలో బృందవనాన్ని తలిపించే విధంగా మొత్తం పచ్చ గడ్డిని నాటారు. అతిథులు కూర్చోడానికి ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడం కోసం సర్పంచ్, ఎంపీటీసీ, పాలక వర్గం, గ్రామస్తులు తీసుకుంటున్న చర్యలు భేష్ అంటూ ట్విట్టర్లో ప్రశంసించారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

