వైటీపీఎస్ను గాలికొదిలిన సర్కార్
దక్షిణాదిలోనే రెండో అతిపెద్ద థర్మల్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అత్యంత కీలకమైన ప్లాంట్ పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించింది. జెన్కో ఇంజినీర్లను పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించింది. పూర్తిస్థాయిలో ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించనే లేదు. దీంతో ప్లాంట్ పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
- కేసీఆర్‌కు పేరొస్తుందనే ప్లాంట్‌పై కక్ష
- ఇన్నాళ్లూ పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
- ఇంజినీర్ల పర్యవేక్షణను ప్రైవేట్కిచ్చిన ఫలితమిది
- ఇంజినీర్లు లేఖలు రాసినా పట్టించుకోని వైనం
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): దక్షిణాదిలోనే రెండో అతిపెద్ద థర్మల్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అత్యంత కీలకమైన ప్లాంట్ పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించింది. జెన్కో ఇంజినీర్లను పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించింది. పూర్తిస్థాయిలో ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించనే లేదు. దీంతో ప్లాంట్ పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్నా పట్టించుకోలేదు. ప్లాంట్లల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నమే చేయలేదు. ముఖ్యంగా ఈ రెండున్నరేండ్లలో వైటీపీఎస్‌కు కోల్ లింకేజీకి చర్యలే చేపట్టలేదు. అవసరమైన బొగ్గుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించనూ లేదు. కానీ ఇప్పుడు విద్యుత్తు కొరత సమస్య ఏర్పడగానే తెగ హడావుడి చేస్తున్నది. వైటీపీఎస్‌కు అధికారులకు పంపిం చి, ఇన్చార్జులను నియమించి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నదన్న వాదనలున్నాయి.
కేసీఆర్‌కు క్రెడిట్ దక్కుతుందనే వివక్ష
వైటీపీఎస్.. గత కేసీఆర్ సర్కార్ చేపట్టిన కీలక విద్యుత్తు ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్లాంట్ సమర్థంగా నడిస్తే.. కేసీఆర్‌కే రాజకీయంగా క్రెడిట్ దక్కుతుందన్న కారణంలోనే కాంగ్రెస్ సర్కార్ ఆ ప్లాంట్‌పై నిర్లక్ష్యం చూపుతూ వస్తున్నది. రాష్ట్రంలో విద్యుత్తు కొరత సమస్య తలెత్తిన ఈ తరుణంలో వైటీపీఎస్ ఆశాదీపమైంది. మొన్నటికి మొన్న ఎండాకాలంలోనూ వైటీపీఎస్యే ఆదుకున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషించే ఈ ప్లాంట్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఈ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది. ఎట్టకేలకు మొన్ననే ఓఅండ్ఎంతోపాటు, కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణ, ఇంజినీర్ల పర్యవేక్షణకు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది.
ఇంజినీర్లు, సిబ్బంది కొరత
వైటీపీఎస్‌లో ఇంజినీర్లు, సిబ్బంది కొరత కారణంగా ప్లాంట్‌ను ఎలా నడుపాలని సాక్షాత్తు జెన్కో సీఎండీకి ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ ఇటీవల లేఖ రాశారు. తగినంత ఇంజినీర్లను, సిబ్బందిని కేటాయించాలని ఆ లేఖలో ప్రస్తావించారు. అయినా జెన్కో స్పందించిన దాఖలాల్లేవు. సిబ్బందిని కేటాయించనూలేదు. వైటీపీఎస్‌లో 1,650 మంది అవసరమైతే కేవలం 1,200 మందిని మాత్రమే కేటాయించింది. దాదాపు 400 మంది కొరత ఉన్నది. ఒక యూనిట్ మూడు షిప్టుల్లో నడువాలంటే దాదాపు 200 మంది ఇంజినీర్లు, మరో 300 మంది ఓ అండ్ఎం సిబ్బంది అవసరం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

