Hyderabad | ఉద్యోగం ఇప్పిస్తానని భర్త టోకరా.. భార్యను ఎత్తుకెళ్లిన బాధితులు
Hyderabad | ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగి నుంచి ఒకరు రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఏడేండ్లు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడి పెంచాడు.
Hyderabad | దుండిగల్, మే 25: ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగి నుంచి ఒకరు రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఏడేండ్లు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడి పెంచాడు. రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్ చేశారు. తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతామని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం ఉదయం జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం పోలీసుల జోక్యంతో సాయంత్రానికి సుఖాంతమైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెందిన ఎలిజబెత్‌రాణికి 19 ఏండ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్‌నగర్‌లో ఉంటున్న వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. ఎలిజబెత్‌రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. భర్త లక్ష్మణరావు ఏడేండ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి రూ.3-4 లక్షలు తీసుకున్నాడు. లక్ష్మణరావు చేస్తున్న దందా తెలుసుకున్న ఆ ఉన్నత ఉద్యోగి అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. వెంకటేశ్ డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళలు శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎలిజబెత్‌రాణి తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యా దు చేయగా, కేసు నమోదు చేశారు. వెంకటేశ్ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి సాయంత్రానికి బాధితురాలిని, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులో ఉన్నారు. రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

