సుబేదారి, జూన్ 14: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ విభాగం ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌ను ఆదివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రాజ్‌కుమార్‌ను జనగామలోని జైలుకు తరలించినట్టు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు.