Chilkur | చిలుకూరు ఆలయంలో రేపు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు
Chilkur | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.
Chilkur | రంగారెడ్డి : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. వివాహ ప్రాప్తి కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. పెళ్లి కావాల్సిన వాళ్లు తమ ఇళ్లల్లో నుంచే దేవుడ్ని ప్రార్థించుకోవాలని సూచించారు. నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తిని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం జరిగే కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందని రంగరాజన్ స్పష్టం చేశారు.
నిన్న గరుడ ప్రసాదం కోసం దాదాపు 1.50 లక్షల మందికి పైగా వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రసాదం కేవలం 10 వేల మందికి సరిపోయేంత మాత్రమే ఉండగా ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తులు లైన్లలో నిల్చున్నారు. దీంతో మళ్లీ చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 35 వేల మందికి గరుడ ప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తుల రద్దీతో సుమారు 5 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

