హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా సైబర్‌క్రైమ్ పోలీసులు ‘తెలుగు స్క్రైబ్ ‘ ‘ఎక్స్’ హ్యాండిల్‌కు నోటీసులు జారీచేశారు.
గతంలో సైతం పవన్ కల్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మాట్లాడిన వీడియోలను తొలగించాలని అన్నమయ్య జిల్లా సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.