అందని వేతనం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- ఆరు నెలలుగా జీతం లేక ఆర్థిక ఇబ్బందులు
- సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదం
రాజన్న సిరిసిల్ల, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని గణేశ్‌నగర్‌కు చెందిన గడ్డం అజయ్(27) ఐదేండ్ల క్రితం టెస్కో గోదాంలో చీరల చెకింగ్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత రెండేండ్ల క్రితం చేనేత జౌళీశాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కమ్యూనిటీ ఫెసిలేటర్గా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధుల్లో చేరాడు. ఈ క్రమంలో అజయ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఐదేండ్లుగా నిమ్స్ దవాఖానతోపాటు ఇతర దవాఖానల్లో వైద్యం చేయించుకోవడానికి రూ.10లక్షల వరకు ఖర్చుచేశాడు. సోమవారం సైతం కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అదేరోజు రాత్రి అజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు రిఫర్ చేయగా, అక్కడి ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అజయ్ మృతితో కార్మిక క్షేత్రంలో విషాదం అలుముకున్నది. ఆరు నెలలుగా వేతనం రాకపోవడంతో అజయ్ వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కుటుంబ సభ్యులు వాపోయారు. తక్షణమే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

