TS LAWCET | టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్-2024 షెడ్యూల్ విడుదల
TS LAWCET | మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ -2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
TS LAWCET | హైదరాబాద్ : మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ -2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 15.
టీఎస్ లాసెట్ దరఖాస్తు రుసుం రూ. 900. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా నిర్ణయించారు. టీఎస్ పీజీఎల్‌సెట్ దరఖాస్తు రుసుం రూ. 1100. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 900గా నిర్ణయించారు.
రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25వ తేదీ లోపు, రూ. 1000 ఆలస్య రుసుంతో మే 5వ తేదీ లోపు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో మే 15 లోపు, రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి 25వ తేదీ మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 30 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
లాసెట్, పీజీఎల్‌సెట్ రాతపరీక్షలను జూన్ 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. మూడేండ్ల కోర్సులో చేరేవారికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఐదేండ్లు, పీజీఎల్‌సెట్ రాతపరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక కీని జూన్ 6న విడుదల చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- LLB Course
- LLM
- PGLCET
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

