అల్వాకే టీఆర్ఎస్ మద్దతు
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలంతా శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అల్వాకు ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు
- ఉప రాష్ట్రపతి ఎన్నికపై పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం
- టీఆర్ఎస్ ఎంపీలతో అల్వా భేటీ.. సీఎంకు కృతజ్ఞతలు
- బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై నిరంతరం పోరు: కేకే
- మతం పేరుతో సామాజిక విభజనను సహించే ప్రసక్తే లేదు
- మోదీ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు
- కేంద్రంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఘాటు విమర్శలు
- నేడు ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక
వజ్రోత్సవాలు ఎవరికీ పోటీ కాదు
రాష్ట్రంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఎవరికీ పోటీగా జరపడం లేదు. స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలియజెప్పేందుకే వాటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారి త్యాగాలను గుర్తుచేసుకోవటమే కాకుండా ఆ స్ఫూర్తిని నేటి తరాల వారికి తెలియజేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. – వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలంతా శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అల్వాకు ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుతోపాటు పార్టీ ఎంపీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నివాసానికి వచ్చిన మార్గరెట్ అల్వాకు పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, పోతుగంటి రాములు, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందజేశారు. ఎంపీలందరినీ కేకే పేరుపేరునా పరిచయం చేశారు. తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని ఆమెకు తెలిపారు.
మోదీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా తాము మొదటి నుంచే ఉద్యమిస్తున్నామని చెప్పారు. మార్గరెట్ అల్వాను తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడటం లేదని, ఆ మాటకొస్తే ఆమె ప్రస్తుతం కాగ్రెస్ పార్టీతో లేరని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, దేశ సమాఖ్య స్ఫూర్తిని ఆయన కాలరాస్తున్నారని మండిపడ్డారు. కేవలం సాంస్కృతిక జాతీయవాదాన్ని ముందుకు తెస్తూ మతం పేరిట సమాజాన్ని విభజించడాన్ని ముమ్మాటికీ సహించబోమని, అది దేశ హితానికి కూడా మంచిది కాదని స్పష్టం చేశారు. సహకార సమాఖ్య విధానాన్ని మోదీ బోగస్‌గా మార్చారని దుయ్యబట్టారు. ఆయన అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారిందని, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్ముకోవడమే పనిగా పెట్టుకొన్న మోదీ సర్కార్ మౌలిక రంగాలను విస్మరించడం దురదృష్టకరమన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తి పెరగాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
దేశానికే తెలంగాణ దిక్సూచి
అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కేకే పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు తమ వద్ద కూడా అమలు కావాలని అనేక రాష్ర్టాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. అద్భుత పాలనతో సీఎం కేసీఆర్ దేశానికి ఆశాదీపంలా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశమంతా తమతో ఉన్నట్టు బీజేపీ భ్రమ పడుతున్నదని, ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే ఆ భ్రమల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతున్నదని కేకే తెలిపారు.
వజ్రోత్సవాలు ఎవరికీ పోటీ కాదు
ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తాము ఎవరికీ పోటీగా జరపడం లేదని, స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజెప్పేందుకే వాటిని నిర్వహిస్తున్నామని కేకే స్పష్టం చేశారు. సాయుధ పోరాటం, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారి త్యాగాలను గుర్తుచేసుకోవటమే కాకుండా వాటి స్ఫూర్తిని నేటి తరాల వారికి తెలియజేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వివరించారు. భారతీయుల్లో ఐక్యత, మతసామరస్యం ఉండాలని ఆనాడు దేశమంతా పోరాడిందని, ఆ విలువలను భవిష్యత్ తరాలకు చెప్పేందుకే తెలంగాణలో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Election
- Margaret Alva
- supports
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

