కోమటిరెడ్డివి మైండ్ గేమ్ రాజకీయాలు : ఎంపీ బడుగుల లింగయ్య
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివి మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లింగయ్య యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. గత రెండు, మూడు నెలల నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీజేపీతోనే అభివృద్ధి అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్లినా తమకు సంబంధం లేదు. కానీ తమ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ మూడున్నరేండ్లలో ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించావు అని నిలదీశారు. ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నావా? అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో తాను, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు కనబడకుండా పోయావని పేర్కొన్నారు. బాధ్యతగా టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడులో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎన్నిసార్లు పిలిచినా రాజగోపాల్ రెడ్డి రాలేదని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఇచ్చే కల్యాణలక్ష్మీ చెక్కులు కూడా పంపిణీ చేయలేదన్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడని లింగయ్య యాదవ్ పేర్కొన్నారు.
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే..
మునుగోడు ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నిక వచ్చిన టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. మునుగోడులో ఎగిరిదే గులాబీ జెండానే అని తేల్చిచెప్పారు. నిన్ను గెలిపించినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబమంతా రాజకీయాల్లో ఉండి.. వ్యాపారాల కోసం ఆ పార్టీ.. ఈ పార్టీ అని చూస్తున్నారని లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

