ముందు ఫేక్.. ఇప్పుడు ఒరిజినల్!
హైడ్రా తీరు రోజు రోజుకూ వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా ఫైర్ ఎన్వోసీల వ్యవహారంలో హైడ్రా వైఖరి వివాదాస్పదంగా మారింది. ముందు నకిలీవని ముద్రవేసిన హైడ్రా.. ఇప్పుడు అవి అసలువేనని ధ్రువీకరిస్తున్నది. మొదట 57 ఫైర్ ఎన్వోసీలు ఫేక్ అని తేల్చిన హైడ్రా ఇప్పుడు మాట మార్చింది.
- ఫైర్ ఎన్వోసీలపై హైడ్రా యూటర్న్
- 57 సర్టిఫికెట్లు బోగస్‌గా నిర్ధారణ
- తాజాగా 30 అసలైనవేనని ఇంటర్‌బోర్డుకు నివేదిక
- ప్రైవేట్ కాలేజీలతో హైడ్రా ఆటలు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హైడ్రా తీరు రోజు రోజుకూ వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా ఫైర్ ఎన్వోసీల వ్యవహారంలో హైడ్రా వైఖరి వివాదాస్పదంగా మారింది. ముందు నకిలీవని ముద్రవేసిన హైడ్రా.. ఇప్పుడు అవి అసలువేనని ధ్రువీకరిస్తున్నది. మొదట 57 ఫైర్ ఎన్వోసీలు ఫేక్ అని తేల్చిన హైడ్రా ఇప్పుడు మాట మార్చింది. వాటిలో 30 సర్టిఫికెట్లు ఒరిజినల్ అని ఇంటర్‌బోర్డు అధికారులకు నివేదిక పంపింది. హైడ్రా వైఖరి అనుమానాస్పదం కావడంతోపాటు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో అది ఆటలాడుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఫైర్ ఎన్వోసీలు సమర్పించడం.. అనుమతులు పొందడం.. ఆ తర్వాత 57 ఎన్వోసీలు ఫేక్‌గా తేలిన విషయం తెలిసిందే.
రోజుకో ట్విస్ట్
ఫైర్ ఎన్వోసీల వ్యవహారం రోజుకో ట్విస్ట్‌తో సీరియల్‌ను తలపిస్తున్నది. ప్రైవేట్ కాలేజీలు సమర్పించిన 75 ఫైర్ ఎన్వోసీలను హైడ్రా క్షుణ్ణంగా తనిఖీ చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన 29, హైదరాబాద్‌లో 28, మేడ్చల్- సంగారెడ్డి జిల్లాల్లో 18 చొప్పున ఎన్వోసీలను హైడ్రా పునఃపరిశీలన చేసింది. తొలుత 25 ఒరిజినల్ అని తేల్చింది. మంగళవారానికి ఈ సంఖ్య 30కి చేరింది. అయితే ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఓ అడుగు ముందుకేసి 52 కాలేజీల ఫైర్ ఎన్వోసీలు అసలువని తేలినట్టు చెప్తున్నాయి.
ఫేక్ ఎన్వోసీలు సమర్పించారన్న కారణంగా ఒక్కో కాలేజీపై ఇంటర్‌బోర్డు రూ.8లక్షల జరిమానాలు వి ధించింది. ఇప్పుడవి అసలువని తేలడంతో కాలేజీలు జరిమానాలు కట్టేందుకు ససేమిరా అంటున్నాయి. మధ్య దళారుల ద్వారా వెళితే నే ఫైర్ ఎన్వోసీలు జారీ అవుతున్నాయని.. తాము దరఖాస్తు చేస్తే ఇవ్వడంలేదని కొందరు కాలేజీ నిర్వాహకులంటున్నారు. మధ్య దళారులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ వ్యవహారంలో కొందరు డీఐఈవోల పాత్రకూడా ఉందని.. వారిపైనా చర్యలు తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

