చాలామందికి బిల్లులు ఇవ్వట్లే!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే బిల్లులు చెల్లించడం లేదని చెప్పడం సరికాద ని, రాష్ట్రంలో చాలాచోట్ల నిధుల కొరత ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అంగీకరించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
- అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే కాదు.. అనేకనియోజకవర్గాల్లో నిధుల కొరత
- జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుంది
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే బిల్లులు చెల్లించడం లేదని చెప్పడం సరికాద ని, రాష్ట్రంలో చాలాచోట్ల నిధుల కొరత ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అంగీకరించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుల మంజూరు విషయంలో ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని పీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీ సులు ఇచ్చి వివరణ తీసుకుంటుందని చెప్పా రు. నవంబర్ 1న ఢిల్లీ ర్యాలీకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ట్రైన్స్ కోసం అర్జీ పెట్టుకుంటే కుంటిసాకులతో ఇ వ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదే సౌత్ సెంట్రల్ రైల్వే గతంలో తాము బీసీ ధర్నా కోసం ఢిల్లీకి వెళ్లేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తు పెట్టుకుంటే రైళ్లు ఇచ్చిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకున్నదని ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ .. రాజకీయాల్లో ఎన్ని సీట్లు గెలిచామన్నది కాదు, ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. మోదీకి ప్రెస్మీట్లు పెట్టి జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేదని, అందుకే సోషల్‌మీడియాలో పోస్టులు మాత్రమే పెడుతుంటారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

