హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): భారతీయ విద్యార్థుల కోసం ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, తాషెంట్ మెడికల్ అకాడమీ (టీఎంఏ) కలిసి టోల్ ఫ్రీ నంబర్‌ను, వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి. టీఎంఏ వైస్ డీన్ డాక్టర్ ఖొల్మతోవ్, టీఎంఏ భారత ప్రతినిధి డాక్టర్ దివ్యారాజ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో వీటిని ఆవిష్కరించారు. ఎన్ఎంసీ ప్రమాణాల మేరకు 18001232 931 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను, www.studyinuzbek.uz అనే వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.