Police Martyrs Day | ప్రజారక్షణలో అలుపెరగని పోలీస్.. శాంతిభద్రతలే ధ్యేయంగా విధులు
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం.
- నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
Police Martyrs Day | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో పోరాడుతారనే ధీమా. 24 గంటలూ ప్రజారక్షణే పరమా‘విధి’గా, శాంతిభద్రతలను కాపాడటమే ధ్యేయం గా ఎందరో పోలీసులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. 1959 అక్టోబర్ 21న ‘భారత్-టిబెట్ ’ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ వద్ద చైనా సైనికుల నుంచి దేశరక్షణ కోసం 10 మంది భారత కేంద్ర రిజర్వు పోలీసులు అసువులు బాశారు. ఆ రోజున ప్రతియేటా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరులకు నివాళులర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, పోలీసు అమరుల కుటుంబాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పరేడ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులు అయ్యారని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ వీడియో సందేశంలో చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

