ఈటల రాజేందర్‌పై టీఎంయూ నేతల ఫైర్

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని
ఆర్టీసీ టీఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద
ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు.
మీడియా సమావేశంలో టీఎంయూ నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఈటల రాజేందర్ చేసింది ఏమీ లేదు. తెలంగాణ కోసం ఎమ్మెల్సీ కవిత ఎన్నో పోరాటాలు చేశారు. ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటి..? ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఎవరైనా ఉండొచ్చు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం గురించి ఈటల మాట్లాడటం విడ్డూరం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అలాంటి పార్టీలో ఈటల ఎట్లా చేరుతడు? ఆర్టీసీని ఆదుకుంటున్నది సీఎం కేసీఆరే. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఈటల రాజేందర్‌కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస. బలహీన వర్గాల సంక్షేమం కంటే ఆయనకు పదవులే ముఖ్యం. అని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

