Jagga Reddy | సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో స్పెషలిస్టు జగ్గారెడ్డి.. సంగారెడ్డికి ఆయన చేసిందేంటి?
సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రులకు ఆయన సన్నిహితంగా ఉండేవారు. కానీ, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం చిత్తశుద్ధితో కృషి చేయలేదు.
Jagga Reddy | ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పెషలిస్టు. ఓట్లు డబ్బాలో పడేవరకు ఓటర్లను బుట్టలో పడేయడంలో ఆయన ప్రావీణ్యులు. తాను గెలిస్తే ప్రజలకు ప్రతినెలా డబ్బులు ఇస్తానని, ఈ డబ్బులు తీసుకునేందుకు వీధికో ఏటీఎంను ఏర్పాటు చేస్తానని గత ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సంగారెడ్డి ప్రజల అవసరాలు తీర్చలేదు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగారెడ్డి దశ తిరిగింది. 2014లో బీఆర్ఎస్ తరఫున చింతా ప్రభాకర్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకవచ్చి ప్రజల అవసరాలు తీరుస్తున్నారు.
సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రులకు ఆయన సన్నిహితంగా ఉండేవారు. కానీ, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం చిత్తశుద్ధితో కృషి చేయలేదు. 40 వేల మందికి ఇంటి స్థలాలు ఇస్తానని, తన డబ్బులు, ఎమ్మెల్యేగా వచ్చే వేతనం కలిపి వృద్ధులకు సొంతంగా రూ.500 పింఛన్ ఇస్తానని అమలు కాని హామీలు ఇవ్వడం తప్ప సంగారెడ్డి అభివృద్ధి, భవిష్యత్తు గురించి ఆయనకు పట్టలేదు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నప్పటికీ సంగారెడ్డిపై నాటి కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపించింది.

నెరవేరిన చిరకాల కలలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సంగారెడ్డి వడివడిగా అభివృద్ధి చెందుతున్నది. 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. సంగారెడ్డి డెవలప్మెంట్కు కావాల్సిన ప్రత్యేక నిధులను ఆయన తీసుకువచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా సంగారెడ్డి పరిస్థితులపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి చొరవ తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా ఇక్కడి ప్రజలు మెడికల్ కాలేజీ కావాలని కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేసింది. తాగునీటి సమస్య లేకుండా మార్చింది. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. మౌలిక వసతుల మెరుగుపరిచింది. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 50 గ్రామాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. గెలిచినా, ఓడినా సంగారెడ్డి అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో చింతా ప్రభాకర్ సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి
- సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 450 పడకల సూపర్‌స్పెషాలిటీ దవాఖానగా అప్‌గ్రేడ్
- రూ.40 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు
- రూ.25 కోట్ల పారామెడికల్ కాలేజీ మంజూరు
- రూ.10 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల భవనం
- రూ.25 కోట్లతో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాల నిర్మాణం
- రూ.40 కోట్లతో రెండు మైనార్టీ కళాశాలలు
- రూ.78 కోట్లతో కంది-శంకర్పల్లి రహదారి నిర్మాణం
- రూ.7 కోట్లతో మంజీరా నదిపై చెక్‌డ్యాంల నిర్మాణం
- రూ.113 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధ్దరణ
- రూ.145 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా
- రూ.23 కోట్లతో కొత్త గోదాంల నిర్మాణం
- రూ.95 కోట్ల ప్రత్యేక నిధులతో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధి
- సదాశిపేటలో కొత్తగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు
- రూ.19 కోట్లతో మల్కాపూర్ నుంచి మైతాబ్‌ఖాన్‌గూడ వరకు రహదారి నిర్మాణం
- సదాశివపేటలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలకు 5 ఎకరాల చొప్పున శ్మశానవాటికల స్థలం మంజూరు(విలువ సుమారు రూ.100 కోట్లకు పైనే)
- రూ.30 కోట్లతో 56 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం
- రూ.113 కోట్లతో పంచాయతీరాజ్ ద్వారా రహదారులు, భవనాల నిర్మాణం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

