Konda Sureha | మంత్రి కొండా సురేఖ చుట్టూ సొంత పార్టీ నుంచే ఉచ్చు బిగుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సురేఖ వ్యతిరేక వర్గం ఏకమవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్(Congress)ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి.
అయితే ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను అదునుగా తీసుకుని, కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ ఆమె వ్యతిరేక వర్గం నాయకులు పావులు కదుతుపున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులంతా నిన్న ప్రత్యేకంగా సమావేశమై కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్లు సమాచారం