హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 21 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, 16 నుంచి 19 వరకు స్లాట్ బుకింగ్, ఫిజికల్ వెరిఫికేషన్, 22న మెరిట్ లిస్టు, 23, 24న వెబ్ఆప్షన్లు, 25న ఫేజ్1లో ఎడిట్ ఆప్షన్, 28న ఎంపిక జాబితా విడుదలవుతుంది.
సీటు పొందిన కాలేజీలో విద్యార్థులు 29 నుంచి వచ్చే నెల 2 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 4 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని లాసెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్ రాగా, 11న నోటిఫికేషన్ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.