ఆ మాట విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి కాదు
- అది ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించింది
- వారు బాధపడితే మాట ఉపసంహరణ
- ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణభవన్‌లో గత గురువారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘కల్వకుర్తి నియోజకర్గంలో బీజేపీ నాయకుడు.. పొద్దున లేస్తే తాను మోదీతోనే ఉంటానని చెప్పుకొనే పెద్ద నాయకుడు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తమ వాటా ఉన్నదని నిస్సిగ్గుగా చెప్తారు’ అని తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ సమావేశంలో ‘విశ్వబ్రాహ్మణులను (చారీలను) తాను కించపరిచినట్టు కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం’ అని శనివారం ఒక ప్రకటనలో మంత్రి కేటీఆర్ వివరించారు. ‘ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటను ఉసంహరించుకుంటున్నాను’ అని ఆయన ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

