RTC Bus Catches Fire | తడకమల్లలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..!
RTC Bus Catches Fire | మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. గ్రామంలో మంగళవారం రాత్రి నైట్‌హాల్టుగా ఉన్న ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు సమాచారం.
RTC Bus Catches Fire | మిర్యాలగూడ, జులై 23 : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. గ్రామంలో మంగళవారం రాత్రి నైట్‌హాల్టుగా ఉన్న ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు సమాచారం. దాంతో బస్సు పాక్షికంగా దగ్ధమైందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్‌కు ఎందుకు నిప్పు పెట్టారో ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

