Telangana | సచివాలయ బందోబస్తు బాధ్యతలు చేపట్టిన ఎస్పీఎఫ్
Telangana | సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్ నియమితులయ్యారు
Telangana | సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్ నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయ ఆవరణలో పూజలు నిర్వహించి బందోబస్తు బాధ్యతలను చేపట్టారు.
గతంలో సచివాలయానికి ఎస్పీఎఫ్ బలగాలే బందోబస్తు నిర్వహించేవి. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ బాధ్యతను స్పెషల్ పోలీసులకు (టీజీఎస్పీ) అప్పగించారు. అయితే ఇటీవల ఏక్ పోలీస్ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే అటు పరువు పోవడంతోపాటు ఇటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, ఇంటివద్ద రక్షణను ఎస్పీఎఫ్కు అప్పగించింది. తాజాగా సచివాలయాన్ని సైతం ఎస్పీఎఫ్ పరిధిలోకి తీసుకెళ్లింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

