Prabhaker Rao | నాకు ఆహ్వానం లేదు.. ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లను..?: ప్రభాకర్ రావు
Prabhaker Rao | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఈ సమీక్షకు హాజరు కాలేదు. ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ఆయన హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు రాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఈ సమీక్షకు హాజరు కాలేదు.
ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ఆయన హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు రాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షకు హాజరుకాకపోవడంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలువలేదని చెప్పారు. ముఖ్యమంత్రి సమీక్షకు పిలిస్తే తాను ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. దాంతో ప్రభాకర్‌రావును సమీక్షకు పిలువాలని సీఎం ఆదేశించినా విద్యుత్ శాఖ కార్యదర్శి ఎందుకు పిలువలేదనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా, విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నాయని సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. దాంతో విద్యుత్ శాఖలో అసలు ఏం జరుగుతోంది అనే కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామనే హామీ కూడా ఉన్నది. ఈ హామీ అమలు చేసేందుకే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమీక్ష జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై ఆ సమీక్షలో ఆరా తీశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రేపటి నుంచే మహిళల ఉచిత ప్రయాణం హామీ అమలు కానుంది. దీనికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనుంది. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

