హైదరాబాద్ ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారంరోజులుగా సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే రానున్న మూడు, నాలుగు రోజులు వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించారు.