పోలీసు వ్యవస్థ బలపడింది: డీజీపీ మహేందర్ రెడ్డి
DGP Mahender reddy | ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు.

హైదరాబాద్: ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కొవిడ్ సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

