హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ముందుగా, ఈ బదిలీలపై ఉన్న స్టేను వెకేట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, సహా అధ్యక్షుడు ఎల్లయ్య సోమవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. టీచర్ల గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను వర్తింపజేయాలని, పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ను అందజేయాలని కోరారు. 2013-18 వరకు రావాల్సిన సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇదే విషయమై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.