కరువు మండలాలపై కొర్రీలు
కరువు మండలాల ప్రకటనతో వచ్చే పరిహారంతో కొంతైనా ఉపశమనం లభిస్తుందేమోనని ఆశపడి తే అదీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
- రాష్ట్రంలో 358 మండలాలు గుర్తింపు
- అడ్డొస్తున్న కేంద్ర సర్కార్ నిబంధనలు
- 315 మండలాలకే వర్తించే అవకాశం
- సెప్టెంబర్ వరకే కరువు పరిగణనలోకి
- ఆ తర్వాత యాసంగిలోనే లెక్క
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఏర్పడిన కరువు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. అయితే కరువు మండలాల ప్రకటనతో వచ్చే పరిహారంతో కొంతైనా ఉపశమనం లభిస్తుందేమోనని ఆశపడి తే అదీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కరువు మండలాల ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. ఓ వైపు కరువు తారస్థాయికి చేరి పంటలకు సాగునీరు, క రెంట్ కరువయ్యాయి.
ఎక్కడచూసినా ఎండిన పంటలే వెక్కిరిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా కరువు మండలాలపై ప్ర కటన చేయలేదు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీకి ఇచ్చిన నివేదిక లో 358 మండలాలను కరువు ప్రాం తాల కింద పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం గుర్తించిన కరువు మండలాలపై కొర్రీలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రం 358 మండలాలను గుర్తిస్తే కేంద్రం 315 మండలాలకే అంగీకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖరీఫ్(వానకాలం) సీజన్‌కు సంబంధించి కరువు లెక్కించాల్సి వస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని ఓ అధికారి తెలిపారు.
ఆ తర్వాత కరువు ఏర్పడితే దాన్ని రబీ(యాసంగి) సీజన్లో పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం 315 మండలాలను మాత్రమే లెక్కలోకి తీసుకొనే అవకాశం ఉన్నదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. వాటిని కూడా పెద్దగా లెక్కలోకి తీసుకొనేలా లేదని తెలిపారు. ఈ సీజన్లో ఏర్పడిన కరువు పరిస్థితులన్నీ యాసంగి కిందకే వస్తాయని, తద్వారా పరిహారం రబీ విపత్తు నివేదికపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి పరిహారం రావడం కష్టమేనని ఆ సదరు అధికారి వ్యక్తం చేయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

