Amrapali | తెలంగాణ హైకోర్టులో ఆమ్రపాలికి చుక్కెదురు.. క్యాట్ ఉత్తర్వులపై స్టే!
Amrapali | ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Amrapali | ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర దాఖలు చేయాలని ఆమ్రపాలికి సూచించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది అక్టోబర్లో డీవోపీటీ ( కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని ఆమె క్యాట్లో సవాలు చేశారు. దీంతో ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డీవోపీటీ వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని వివరించింది. ఈ క్రమంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Amrapali
- Amrapali Kata
- Cat
- DoPT
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

