ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా
ముషీరాబాద్ డిపో స్థలం 6.5 ఎకరాలు హౌసింగ్ బోర్టుకు కేటాయిస్తూ జీవో.. రూ.1000 కోట్ల భూమి ఇస్తూ జీవో జారీ.. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
- భగ్గుమన్న కార్మికులు.. మిలిటెంట్ పోరాటం తప్పదు: ఆర్టీసీ సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న అత్యంత ఖరీదైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని ముషీరాబాద్ డిపో పరిధిలో ఉన్న సుమారు రూ. వెయ్యి కోట్ల విలువైన 6.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ పేరిట ఈ నెల 22న జీవో నంబర్ 206 జారీ అయింది.
ఆర్టీసీ ఆధీనంలో ఉన్న జమీస్తాన్‌పూర్ విలేజ్ పరిధిలోని పలు సర్వే నంబర్ల భూమిని అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఎల్ఐజీ, ఎంఐజీ ఫ్లాట్ల నిర్మాణం కోసం కేటాయించారు. లక్ష గృహాల నిర్మాణ లక్ష్యం లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే పనుల కోసం ఈ స్థలాన్ని బదలాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేరొన్నారు. కేటాయించిన మొత్తం భూమి లో 25 గుంటల స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేకంగా ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కలెక్టర్, సీసీఎల్ఏ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఆర్టీసీ మనుగడకు కీలకమైన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
మనుగడను దెబ్బతీయొద్దు: బాబు, వెంకన్న
ప్రభుత్వ అవసరాల పేరిట ముషీరాబాద్ డిపో భూములను స్వాధీనం చేసుకోవడాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ బాబు, ఈ వెంకన్న తీవ్రంగా ఖండించారు. కార్మికులు దశాబ్దాలుగా రక్తం ధారపోసి, కష్టనష్టాలకోర్చి కాపాడుకున్న విలువైన ఆస్తులను ప్రభుత్వం ఈ విధంగా లాకుంటూపోతే సంస్థ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
సొంత గూడు లేక వేలాది రూపాయల అద్దెలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులకు ఆ స్థలంలో నివాసాలు నిర్మించి ఇవ్వాలే తప్ప ఇతరులకు కట్టబెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇందిరమ్మ ఇండ్లకు నగరంలో ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు స్పష్టంచేశారు. జీవో 206ను రద్దు చేయకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

