ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడుకు చెందిన దళిత రైతు కొలికపోగు రత్తయ్య, సునీత దంపతులు కందుకూరులో ఉన్న 12 గుంటల భూమిలో వరిసాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్‌తో నీటిని తీసుకొచ్చి పంటకు తడులు అందిస్తున్నారు. పంట ఎండిపోకుండా శక్తికి మించి శ్రమిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడుకు చెందిన దళిత రైతు కొలికపోగు రత్తయ్య, సునీత దంపతులు కందుకూరులో ఉన్న 12 గుంటల భూమిలో వరిసాగు చేశారు.
పంట చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్‌తో నీటిని తీసుకొచ్చి పంటకు తడులు అందిస్తున్నారు. పంట ఎండిపోకుండా శక్తికి మించి శ్రమిస్తున్నారు.
– వేంసూరు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి తనకున్న 8ఎకరాల్లో వరి వేశారు. బావుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ అరకొర విద్యుత్తు సరఫరాతో తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం పంట ఈనే దశలో ఉన్నది. ఈ తరుణంలో ఇంటి అవసరాల కోసం కనీసం రెండు ఎకరాలైనా దక్కించుకుందామని ఆర్థిక భారమైనప్పటికీ తెలిసిన వారిద్వారా మాట్లాడుకుని ఇలా ఒకేసారి నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. ఇదే విధంగా మరో రెండు తడులు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు.
– హనుమకొండ సబర్బన్

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం దర్పల్లికి చెందిన రైతు జంగయ్య 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. కరెంట్ కోతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోయింది. మొత్తం ఐదు ఎకరాలకు గాను రెండు ఎకరాల పంటను మేత కోసం గొర్రెలకు వదిలేశాడు. మిగతా పంట కూడా పండుతుందో, ఎండుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశాడు.
– నవాబ్‌పేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

