Assembly sessions | ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు
Assembly sessions | ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
హైదరాబాద్ : ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా..భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.
రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

