దేశంలో 6వ ఉత్తమ ప్లాంట్‌గా ఎస్టీపీపీ
- తొలి త్రైమాసికం ఆదాయం రూ.944 కోట్లు

హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం మొ దటి త్రైమాసికంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎస్టీపీపీ) దేశంలోని అత్యుత్తమ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ త్రైమాసికంలో 92.49 పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించింది. గడిచిన త్రైమాసికంలో సింగరేణి థర్మల్ ప్లాంట్ 2,424 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇందులో 2,283 మిలియన్ యూనిట్లను రాష్ట్ర అవసరాలకు వినియోగించారు. ఈ త్రైమాసికంంలో రూ.944 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించింది. ఇది గతేడాది తొలి త్రైమాసికం కంటే 32.83 శాతం అధికం. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం మొదలైన అంశాలను సమీక్షించే ముంబైకి చెందిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలో సింగరేణి థర్మల్ ప్లాంట్‌కు బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్ అవార్డును ఇటీవలే ప్రదానం చేసింది. ైఇదే కృషిని కొనసాగిస్తూ మంచి పీఎల్ఎఫ్ సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్లాంట్ ఉద్యోగులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- STPP
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

