వేధింపులు తాళలేక కొడుకును హతమార్చిన తండ్రి
కొడుకు హత్య | వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 5 : వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఏలుగం ప్రవీణ్ ప్రతి రోజూ తప్పతాగి వచ్చి ఇంట్లో నానా హంగామా చేసేవాడు. తండ్రి రమేశ్ ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు.
బుధవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చిన ప్రవీణ్ తండ్రితో గొడవకు దిగాడు. దీంతో విసిగిపోయిన రమేశ్ అర్ధరాత్రి ప్రవీణ్ నిద్రిస్తున్న సమయంలో తలపై కత్తితో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం రమేశ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

