CM KCR | రేపు చింతమడకకు సీఎం కేసీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్వేత
CM KCR | అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka) గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు(Vote) వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్(CM KCR) గురువారం రానున్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిసారి కేసీఆర్ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
సిద్దిపేట : అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చింతమడక(Chintamadaka) గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు(Vote) వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్(CM KCR) గురువారం రానున్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిసారి కేసీఆర్ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాట చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట కమీషనరేట్‌కు చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక సాయుధ బలగాలు, జిల్లా హోంగార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, హోంగార్డ్లు, రైల్వే పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సీఆర్పీఎఫ్, జార్ఖండ్ రాష్ట్రం ఆర్మ్డ్ ఫోర్స్, అధికారులు, సిబ్బందితో మొత్తం 2,632 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో నేడు జరిగే ఎన్నికలకు సంబంధించి 278 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేసి. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేశారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా 10 డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

