100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అంజేసిన సిక్మా

హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు సహాయార్ధం సౌత్ ఇండియా సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను గురువారం ప్రభుత్వానికి అందజేసింది. వీటిని సిక్మా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం రవీందర్‌రెడ్డి, సాగర్ సిమెంట్స్ ఎండి డాక్టర్ ఎస్ ఆనంద్‌రెడ్డి, సిక్మా సీఈవో గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న స్పిరిట్ ఆఫ్ అమెరికా సంస్థ 43 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తెలంగాణకు విరాళంగా అందజేసింది. వీటిని రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేటలోని ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చినట్టు స్పిరిట్ ఆఫ్ అమెరికా సీఈవో జిమ్హాక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా అత్యవసర సహాయంగా 320 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దేశంలోని కమ్యూనిటీ సెంటర్లు, జిల్లా ఆరోగ్య కేంద్రాలకు అందజేయాలని ఈ సంస్థ నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

