She Teams | వేదిస్తే ఈపులు పగుల్తయి… ఆకతాయిలూ విన్నారా?.. షీ టీమ్స్ ఏమంటున్నాయంటే?..
She Teams | సోషల్ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని షీటీమ్స్ రంగంలోకి దిగాయి. ఇందుకోసం వినూత్నంగా ఫొటోలు, మీమ్స్, షార్ట్‌ఫిల్మ్‌లు, సందేశాత్మక వీడియోల ద్వారా సోషల్ మీడియానే ఉపయోగించుకొంటున్నది.
She Teams | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని షీటీమ్స్ రంగంలోకి దిగాయి. ఇందుకోసం వినూత్నంగా ఫొటోలు, మీమ్స్, షార్ట్‌ఫిల్మ్‌లు, సందేశాత్మక వీడియోల ద్వారా సోషల్ మీడియానే ఉపయోగించుకొంటున్నది.
ఆడపిల్లలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి.. ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో సవివరంగా పోస్టుల ద్వారా షీటీమ్స్ అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సందేశాత్మక వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్నది. వీటితో పాటుగా ఆయా కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

టెక్నికల్ సిబ్బందికి శిక్షణ
సోషల్ మీడియాలో మహిళలపై చోటుచేసుకుంటున్న వేధింపులను సమర్థవంతంగా అడ్డుకట్ట వేసేందుకు షీటీమ్స్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఉన్న షీటీమ్స్ సిబ్బందికి దఫాలుగా పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. పోకిరీ చేష్టలను ఉపేక్షించకుండా తక్షణమే కేసులు నమోదు చేసి, తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. కటకటాలకు పంపేలా ప్రణాళికలు తయారుచేసింది. వీటితోపాటు సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్, బ్లాక్‌మెయిలింగ్ వంటి తదితర అంశాలను సీరియస్‌గా తీసుకొని సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న పోకిరీల ఆటకట్టించేందుకు, అరెస్టు చేసేందుకు షీటీమ్స్ రంగం సిద్ధం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

