హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు సావిత్రి బాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ ఆదినారాయణ తెలిపారు.
డిజిటల్ మార్కెటింగ్ (ఇంటర్ లేదా డిగ్రీ), ఎంఎస్ ఆఫీస్ (పది లేదా ఇంటర్), హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ (డిగ్రీ/డిప్లొమా), బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ (పదోతరగతి) కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వివరించారు. ఆసక్తి ఉన్నవారు 8341052153, 9652577844 నంబర్లను సంప్రదించాలని సూచించారు.