మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
మద్దూరు మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల సర్పంచులు మండల సభను బహిష్కరించారు.
మద్దూరు ( ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల సర్పంచులు మండల సభను బహిష్కరించారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్పంచులు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల అధికారుల నిర్లక్ష్యం వల్లనే మద్దూరును కరువు మండలంగా ప్రకటించలేదని విమర్శించారు. దీనికి అధికారులే బాధ్యత వహించాలని కోరారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు. గ్రామాల్లో చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో ఎండిపోవడం వల్ల నీళ్లు లేక సరిగా కరెంటు రాక పంటలు ఎండిపోయాయని తెలిపారు. పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించినం తవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు సర్పంచులమంతా దూరంగా ఉంటామన్నారు.
అదేవిధంగా కరువు మండలంగా ప్రకటించేంతవరకు వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను చేపడతా మని హెచ్చరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న సర్పంచులకు ఎస్సై మమ్మద్ ఆసిఫ్ నచ్చజెప్పి విరమిం పజేశారు. అదేవిధంగా ఎంపీడీవో శ్రీనివాస్ ఆందోళన విరమించాలని సర్పంచులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సర్పంచులు తమ ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దామెర మల్లేశం, నీరటి శ్రీనివాస్, ఇట్టబోయిన కనకచంద్రం, కాసర్ల రేణుక కనకరాజు, గడిపే మౌనిక అనిల్ కుమార్, జక్కుల లింగమ్మ కనకయ్య, కర్నె సునీత మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

