ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన ‘ఆర్టీఐ’
సమాచార హకు చట్టం ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన లాంటిది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ‘సమాచార హకు వారోత్సవాలు-2026’లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- గవర్నర్ ఎస్పీ శుక్లా
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : సమాచార హకు చట్టం ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన లాంటిది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ‘సమాచార హకు వారోత్సవాలు-2026’లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ‘సమాచార దర్పణం’ వార్తాపత్రికను ఆవిషరించారు. సమాచార హకు చట్టం అమల్లో విశేష కృషి చేసిన అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి మా ట్లాడుతూ.. 21 వేల కేసులను కమిషన్ పరిషరించిందని తెలిపారు.
అవార్డులు అందుకున్నది వీరే..
ఉత్తమ స్వచ్ఛంద సమాచార వెల్లడి విభాగంలో నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్, టీజీ జెన్కో సీఎండీ హరీశ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా విభాగంలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, శాఖాధిపతి విభాగంలో గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, సచివాలయశాఖ విభాగంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రజా సమాచార అధికారి విభాగంలో ఖమ్మం డీఆర్వో రామ్మూర్తి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ నసీర్, మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, ప్రత్యేక విభాగంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రామగుండం తహసీల్దార్ రవీందర్ అవార్డులు అందుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

