TS RTC | రేపు రెండు గంటలపాటు నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించేది లేదని కార్మికుల హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని (RTC govt merger) అడ్డుకునేలా ఉన్న బీజేపీ వైఖరిపై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో ఉన్న 43,373 మంది కుటుంబాలలో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని, అవసరమైతే రాజ్ భవన్ ముట్టడికి కూడా వెనకాడమని థామస్ రెడ్డి హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

