టామ్‌కామ్ పేరిట భారీ స్కామ్.. కార్మిక శాఖను వివేక్ స్కామ్‌లకు కేరాఫ్‌గా మార్చారు: ఆర్ఎస్పీ
టామ్‌కామ్ పేరిట కార్మిక శాఖ మంత్రి వివేక్ భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశజూపి మోసం చేశారని మండిపడ్డారు.
- విదేశాల్లో కొలువులంటూ ముంచారు
- ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.2.65 లక్షల నుంచి 4లక్షల దాకా వసూలు
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : టామ్‌కామ్ పేరిట కార్మిక శాఖ మంత్రి వివేక్ భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశజూపి మోసం చేశారని మండిపడ్డారు. ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించారు. గు రువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆ యన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ తెస్తామన్న స్కామ్ క్యాలెండర్ తెచ్చిందని, నెలకో స్కామ్ వెలుగుచూస్తున్నదని ఉదహరించారు. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కేసీఆర్ 2014లో టామ్కామ్ను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ దానిని టామ్‌కామ్ స్కామ్‌గా మార్చిందన్నారు.
టామ్‌కామ్ పోయి.. తెరపైకి ఫేర్స్ట్రీట్ కంపెనీ
జర్ననీలో టెక్నికల్, వేర్‌హౌస్, నర్సింగ్, మెకాట్రానిక్స్, డ్రైవింగ్ లాంటి ఉద్యోగాల కోసం 2024 జూలైలో ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని నమ్మి వందలాది మంది చేరారని, ఒక్కొక్కరి నుంచి రూ.2.65 లక్షల నుంచి రూ.4.1 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించా రు. హైటెక్ సిటీలో ఆరు నెలలపాటు గోతే ఇన్స్టిట్యూట్ సాయంతో జర్మనీ భాష నేర్పించారని చెప్పారు. ‘అభ్యర్థులు చేరిన తర్వాత వారి నుంచి అగ్రిమెంట్ ఫారం మీద సంతకాలు తీసుకున్నారు. దీని మీద ఫేర్స్ట్రీట్ కంపెనీ పేరు ఉన్నది. టామ్‌కామ్ పేరు లేదు.
ఇకడే మోసం జరిగింద’ని పేర్కొన్నారు. జర్మనీ వెళ్లాలంటే బీ-1 లెవల్ (భాష) ఎగ్జామ్ స్లాట్ బుక్ చేయడానికి మళ్లీ రూ.20 వేలు కట్టించుకున్నారని తెలిపారు. వీరిని శిక్షణ కోసం వారి ఖర్చులతో చెన్నై, బెంగళూరు, కోల్‌కతా తదితర నగరాలకు పంపించారని చెప్పారు. ఖర్చులన్నీ విద్యార్థులే భరించారని, వందల మంది బీ-1 ఉత్తీర్ణులైన తర్వాత 10 మందిని కూడా జర్మనీకి పంపలేదని పేర్కొన్నారు. మోసపోయిన అభ్యర్థులు ఇండియాకు తిరిగొచ్చి, తమ డబ్బు తిరిగి ఇవ్వాలని టామ్‌కామ్ ఆఫీస్‌కి వెళ్తే… ఫేర్స్ట్రీట్ను అడుగాలని హుంకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డ బ్బులను వాపస్ ఇవ్వాలని, ఫేర్స్ట్రీట్ కంపెనీ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు.
కార్మిక శాఖలో 150 కోట్ల బీమా స్కామ్
వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక శాఖ లో రూ.150 కోట్ల బీమా స్కామ్‌కు తెరలేపారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ట్రయల్ బ్లేజర్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి కార్మికుల సొ మ్మును దోపిడీ చేశారని దుయ్యబట్టారు. బతికున్నవారిని చనిపోయారని చెప్పి, ఫేక్ ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేసి లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. అయినా మంత్రి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
‘తను’ ఏజెన్సీ ఎవరిది?
కార్మిక శాఖలో ఎకడ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలన్నా.. ‘తను’ ఏజెన్సీ నుంచే తీ సుకోవాలని మంత్రి వివేక్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమేందని ప్రవీణ్ ప్రశ్నించారు. ‘తను’ ఏజెన్సీది మంత్రి ఇలాకా అని తెలిసిందని,, ఏజెన్సీ పూర్వాపరాలు తెలియకుండా, అనుభవం లేకుండా కాంట్రాక్టు ఎలా ఇస్తారని నిలదీశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు నిలదీయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

